Thursday, 20 June 2013

చంద్రబాబుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ బహిరంగ లేఖ

చంద్రబాబుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ బహిరంగ లేఖ
         
హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్నలు సంధించింది. చంద్రబాబుకు రాసిన లేఖను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం హైదరాబాద్ లో విడుదల చేసింది. వైఎస్‌పై అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు, ప్రస్తుతం కిరణ్‌ సర్కార్‌ను ఎందుకు కాపాడుతున్నారో తెలపాలని డిమాండ్ చేసింది. అలాగే వైఎస్‌ హయాంలో స్పీకర్‌గా కిరణ్‌ను వ్యతిరేకించిన మీరు.. సీఎంగా ఎలా అర్హుడో సమధానం చెప్పాలని పేర్కొంది. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని మీరు ఎందుకు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును అడిగింది.

మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీలు.. ఈక్రమంలో ఎన్నికలు జరగాలని కోరడానికి భయమేంటని ప్రశ్నించింది. సీఎం, ఆయన సోదరుడు అక్రమార్కులని పదే పదే అంటున్న మీరు ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నట్లో వివరించాలని సూచించింది. సీఎం, ఆయన సోదరుడు పాల్పడుతున్న అవినీతిపై మీరెందుకు గవర్నర్‌, రాజ్యాంగ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని ప్రశ్నించింది. మీపై సీఎం చేసే ఆరోపణలను మీరెందుకు ఖండించడం లేదని అడిగింది. వైఎస్‌ జగన్‌ పత్రిక, చానల్‌ ప్రారంభిస్తే గొంతుచించుకున్న మీరు సీఎం, పీసీసీ చీఫ్‌లకు చానళ్లు ఉంటే మీకెందుకు అభ్యంతరం చేప్పడం లేదో వెంటనే సమాదానం చెప్పాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును డిమాండ్ చేసింది.

Wednesday, 19 June 2013

కడదాకా జగన్ వెంటే: బాలనాగిరెడ్డి



కడదాకా జగన్ వెంటే: బాలనాగిరెడ్డి

కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన బుధవారమిక్కడ ఖండించారు. కావాలనే ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాల నాగిరెడ్డి అన్నారు. కడదాకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.

Tuesday, 18 June 2013

సబ్బం హరి

వైఎస్ఆర్‌సీపీ నుంచే పోటీ: సబ్బం హరి
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని అనకాపల్లి లోక్ సభ సభ్యుడు సబ్బం హరి స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ పర్యటనలో పాల్గొనకపోవడంతో తనపై విమర్శలు వస్తున్నాయన్నది ఎల్లో మీడియా సృష్టి అని ఆయన కొట్టిపారేశారు.